Twinkle Khanna: పెద్దవాళ్ళకే ప్రాక్టీస్ ఎక్కువ: అఫైర్స్‌పై టింకిల్ ఖన్నా సంచలనం వ్యాఖ్యలు!

Twinkle Khanna: పెద్దవాళ్ళకే ప్రాక్టీస్ ఎక్కువ: అఫైర్స్‌పై టింకిల్ ఖన్నా సంచలనం వ్యాఖ్యలు!

బాలీవుడ్ నటీమణులు టింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి హోస్ట్ గా చేస్తున్న 'టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్'  టాక్ షో అమెజాన్ ప్రైమ్ లో దూసుకుపోతోంది.  సినీ ప్రముఖులు ఈ షోలో పాల్గొంటూ.. తన వ్యక్తిగత విషయాలు, సంబంధాలు పంచుకుంటూ ఆసక్తిరేకెత్తిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ టాక్ షోకు అతిథులుగా అనన్య పాండే, ఫరా ఖాన్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా వివిధ తరాల వారి సంబంధాలను, వ్యక్తిగత హద్దులను ఎలా చూస్తారనే దానిపై ఈ చర్చ జరిగింది. ఈ సందర్బంగా వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్రమ సంబంధాలను దాచడంలో వారే మేటి..

ఈ షోలో బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా అక్రమ సంబంధాలు గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పెద్దవాళ్లు చిన్నవాళ్ల కంటే తమ అక్రమ సంబంధాలను దాచడంలో మెరుగ్గా ఉంటారా? అనే ప్రశ్నతో చర్చ ప్రారంభమైంది. ఈ విషయంలో ట్వింకిల్ తో ఫరా ఖాన్, అనన్య పాండే అంగీకరించగా, కాజోల్ మాత్రం విభేదించింది. ట్వింకిల్ నవ్వుతూ..  'పెద్దవాళ్లు చాలా మెరుగ్గా ఉంటారు, వారికి చాలా ప్రాక్టీస్ ఉంటుంది' అని వ్యాఖ్యానించారు. దీనికి అనన్య పాండే కూడా నవ్వుతూ.. మీరంతా చాలా మంచివారు అని చమత్కరించింది.

అయితే ఈ వ్యాఖ్యతో సహనటి కాజోల్ ఏకీభవించలేదు. 'నాకు తెలిసి చిన్నవాళ్లే తమ జీవితంలోని విషయాలను, అఫైర్స్‌ను దాచడంలో మెరుగ్గా ఉంటారు' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి అనన్య పాండే స్పందిస్తూ.. 'సోషల్ మీడియా కారణంగా ఏ విషయం అయినా బయటికి వచ్చేస్తుంది' అని తెలిపింది.  మరోవైపు నేటి యువత ప్రేమలో లేకపోయినా వ్యక్తిగత విషయాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తారని ఫరా ఖాన్  అన్నారు. ఈ చర్చలో భాగంగా, ట్వింకిల్ ఖన్నా తన అభిప్రాయాన్ని సరదాగా చెప్పినప్పటికీ, ఆమె మాటలకు నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.  వైరల్ గా మారాయి.

 ఔట్‌ఫిట్స్ కంటే వేగంగా పార్ట్‌నర్స్‌ని మార్చేస్తున్నారు..

చర్చలో భాగంగా, మరొక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది.  'నేటి తరం యువత తమ దుస్తులు మార్చిన దానికంటే వేగంగా తమ భాగస్వాములను మారుస్తున్నారు. ఈ స్టేట్‌మెంట్‌కు ట్వింకిల్ ఖన్నా పూర్తిగా మద్దతు పలికారు. ఆమె మాట్లాడుతూ..  ఇది మంచి విషయమే. ఎందుకంటే, మా కాలంలో జనాలు ఏమనుకుంటారు? మనం ఇలా చేయకూడదు అనే భయం ఉండేది. కానీ నేటి యువత తమ భాగస్వాములను త్వరగా మారుస్తున్నారు, ఇది మంచి మార్పు అని అభిప్రాయపడింది. సామాజిక కట్టుబాట్ల గురించి పట్టించుకోకుండా, తమ ఆనందం కోసం ధైర్యంగా నేటి యువత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ప్రశంసించారు.

అయితే, దర్శకురాలు ఫరా ఖాన్, కాజోల్, అనన్య పాండే మాత్రం ట్వింకిల్ అభిప్రాయంతో విభేదించారు. నేటి సంబంధాలలో నిజమైన భావోద్వేగ లోతు ఉందనీ, కేవలం వేగంగా మారుస్తున్నారనేది సరికాదనీ వారు వాదించారు. అయినప్పటికీ.. సామాజిక ఆంక్షలు లేకపోవడాన్ని ట్వింకిల్ సానుకూలంగా చూడటం ఆమె నిజాయితీకి నిదర్శనమని అభిమానులు అంటున్నారు. మొత్తంగా ట్వింకిల్ ఖన్నా తన మాటలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుత సంబంధాల విలువలు, పాత, కొత్త తరాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై లోతైన చర్చకు దారితీస్తున్నాయి.