ఉత్సాహంగా  ఒలింపిక్‌ డే రన్‌

ఉత్సాహంగా  ఒలింపిక్‌ డే రన్‌

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ ఒలింపిక్ సంఘం, శాట్స్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ ఒలింపిక్ డే సందర్భంగా శుక్రవారం సిటీలో నిర్వహించిన  ఒలింపిక్ డే రన్ క్రీడాకారుల కేరింతల మధ్య ఉత్సాహంగా సాగింది. నగరంలోని వివిధ స్టేడియాలు సహా 15 సెంటర్ల నుంచి  ప్రారంభమైన రిలే టార్చ్‌లు ఎల్బీ స్టేడియానికి చేరుకున్నాయి.  

ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో  మంత్రులు వి . శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాట్స్‌ చైర్మన్ ఆంజనేయ గౌడ్,  ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి  ఒలింపిక్ టార్చ్‌ని స్వీకరించారు.  అనంతరం 15 సెంటర్ నుంచి  క్రీడా జ్యోతులతో రన్ లో పాల్గొన్న వారిని అభినందించారు.