
ఆసియా కప్ లో సోమవారం (సెప్టెంబర్ 15) ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. ఒమన్, యూఏఈ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఒమన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గెలిచిన జట్టు సూపర్-4 రేస్ లో ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
ఇరు జట్లు తొలి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయాయి. సొంతగడ్డపై ఆడుతున్న యూఏఈ తమ తొలి మ్యాచ్ లో ఇండియాపై 57 పరుగులకే ఆలౌటై చిత్తు చిత్తుగా ఓడింది. మరోవైపు ఒమన్ జట్టు తమ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై 93 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవి చూసింది.
ఒమన్ (ప్లేయింగ్ XI):
అమీర్ కలీమ్, జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), వసీం అలీ, హస్నైన్ షా, షా ఫైసల్, ఆర్యన్ బిష్త్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామానంది
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ప్లేయింగ్ XI):
అలీషాన్ షరాఫు, ముహమ్మద్ వసీం (కెప్టెన్), ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, ముహమ్మద్ రోహిద్ ఖాన్, ముహమ్మద్ జవదుల్లా, జునైద్ సిద్ధిక్