
మామడ (నిర్మల్), వెలుగు: సీఎం కేసీఆర్, నిర్మల్టీఆర్ఎస్ లీడర్ శ్రీహరిరావును తిడుతూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌జిల్లా మామడ మండలం అనంతపేటకు చెందిన ముక్కెర రాజేశ్వర్ఇటీవల సీఎం కేసీఆర్, స్థానిక టీఆర్ఎస్ లీడర్ శ్రీహరిరావుని తిడుతూ వీడియో తీసుకుని తన ఫేస్బుక్లో అకౌంట్లో పోస్ట్ చేశాడు. దాన్ని చూసిన టీఆర్ఎస్ లీడర్లు పోలీసులకు కంప్లైంట్చేశారు. తమ నేతలను తిట్టడమే కాకుండా సోషల్‌మీడియాలో వైరల్ చేశాడని పేర్కొన్నారు. రాజేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని ఎస్సై వినయ్తెలిపారు. కానిస్టేబుల్ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కోర్టు14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిందని, నిర్మల్ సబ్ జైల్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.