అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే నలుగురు హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. తనే ఐశ్వర్యలక్ష్మి. పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తి, గాడ్సే, థగ్ లైఫ్ లాంటి చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపును అందుకుంది.
రెగ్యులర్ గ్లామర్ రోల్స్‌కు భిన్నంగా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో ఆకట్టుకున్న ఆమెను ‘రాకా’ చిత్రంలోని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం దర్శకుడు అట్లీ ఎంపిక చేసినట్టు సమాచారం. అంతేకాదు ఇందులో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించనుందని తెలుస్తోంది. అయితే దీనిపై టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్ కూడా నటిస్తున్నారు. అయితే దీపిక మినహా మరెవరి పేరును మేకర్స్ కన్‌ఫర్మ్ చేయలేదు. ఇక ఇటీవల ‘మట్టి కుస్తీ’ సీక్వెల్‌తో ఆకట్టుకున్న ఐశ్వర్య లక్ష్మి.. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌కు జంటగా నటిస్తోంది.
