భార్య భూమి బామ్మర్ది లాక్కున్నాడని కలెక్టరేట్ లో నిరసన

భార్య భూమి బామ్మర్ది లాక్కున్నాడని కలెక్టరేట్ లో నిరసన

తన భార్యకు చెందిన భూమి పట్టాపుస్తకాలు ఇవ్వకుండా… తనకు రైతు బంధు సహాయం అందివ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో అర్ధనగ్నంగా నిరసనకు దిగాడో వ్యక్తి.

ఖానాపూర్ మండలం దిలావర్ పూర్ లో తన భార్య పుట్టింటి వాళ్లు కట్నంగా 6 ఎకరాల భూమిని ఇచ్చారని వివరించాడు. ఐతే…. ఆమె పేరుతో ఉన్న భూమిని …ఆమె సోదరుడు, తన బావమరిది లాక్కున్నాడని … అధికారులతో కుమ్మక్కై పేరు మార్చుకున్నాడని ఆరోపించాడు. అధికారులు చెప్పినా పట్టించుకోలేదని ఇలా… కలెక్టరేట్ ముందు అర్ధనగ్నంగా… నోటికి నల్లబ్యాడ్జీ, మెడకు ప్లకార్డు వేసుకుని నిరసన తెలిపానని చెప్పాడు.