ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

హైదరాబాద్: ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నారాయణ పేట జిల్లా కోస్గి లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. శివాజీ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్ కు పూల దండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలు తగ్గించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. 

పెట్రో, గ్యాస్, కరెంట్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఎల్బీ నగర్ లో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. బీఎన్ రెడ్డి నగర్ నుంచి వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వరకు ర్యాలీ తీశారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ...ఓ వ్యక్తికి గుండు కొట్టించి నిరసన తెలిపారు.

వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలంలోని తుంకిమెట్లలో హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఏఐసీసీ పిలుపుతో ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి గ్యాస్ సిలిండర్లు ముందు పెట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తల కోసం:

ఈ స్థాయిలో రిజర్వేషన్.. రాజ్యాంగ విరుద్ధం

‘రతన్ టాటాకు భారతరత్న’ పిల్ ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు

అక్రమంగా కట్టిన రేప్ కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత