ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్‌‌

ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్‌‌

హైదరాబాద్‌‌,వెలుగు: ఆన్‌‌లైన్ క్రికెట్‌‌ బెట్టింగ్‌‌ నిర్వహిస్తున్న ఇద్దరు ఆర్గనైజర్లను హైదరాబాద్​ సౌత్‌‌జోన్ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రూ.79 వేలు నగదు,సెల్‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్‌‌ డీసీపీ నరసింహరావు వివరాల ప్రకారం.. చంపాపేట్‌‌కు చెందిన యశ్వంత్‌‌(34), ప్రవీణ్‌‌కుమార్‌‌‌‌(38) ఆన్‌‌లైన్‌‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మియాపూర్‌‌‌‌లోని మెయిన్‌‌ బుకీ ప్రసాద్‌‌ నుంచి వెబ్‌‌ యాప్స్‌‌ తీసుకుని ఆర్గనైజ్ చేస్తున్నారు.

లాగిన్ కోసం ప్రత్యేక ఐడీ, పాస్‌‌వర్డ్స్‌‌ అందిస్తున్నారు. ఆన్‌‌లైన్‌‌లోనే బెట్టింగ్ అమౌంట్‌‌ కలెక్షన్‌‌, పేమెంట్‌‌ చేస్తున్నారు. సమాచారం అందుకున్న సౌత్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం రెయిడ్స్ చేశారు. రూ.79 వేలు బెట్టింగ్ క్యాష్‌‌, సెల్‌‌ఫోన్స్ సీజ్ చేశారు. తదుపరి విచారణకు నిందితులను ఐఎస్‌‌ సదన్ పోలీసులకు అప్పగించారు.