760 మంది స్టూడెంట్లకు 10 మందే టీచర్లు 

760 మంది స్టూడెంట్లకు 10 మందే టీచర్లు 
  • ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలె
  • మేకలమండి ప్రభుత్వ స్కూల్ ముందు తల్లిదండ్రుల ధర్నా 

హైదరాబాద్ /పద్మారావునగర్, వెలుగు: భోలక్ పూర్ కృష్ణానగర్​లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్లను నియమించాలని కోరుతూ హై స్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్టూడెంట్ల  తల్లిదండ్రులు ధర్నా చేశారు. హై స్కూల్ సాధన కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్​లోని మేకలమండి అప్పర్ ప్రైమరీ స్కూల్​లో 760 మంది స్టూడెంట్లకు 10మంది టీచర్లే ఉన్నారన్నారు. వీళ్లు అన్ని సబ్జెక్టలను బోధించలేకపోతున్నారన్నారు. కరోనా టైమ్​లో  ప్రైవేట్ స్కూల్ లో ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్​కి మారిన స్టూడెంట్లతో ఈ ఏడాది అడ్మిషన్లు బాగా పెరిగాయని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. ఆయన స్పందించి డీఈవోకి చెప్పినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్లు వెంటనే టీచర్లను నియమించకుంటే ఆందోళనను ఉదృతం చేస్తామని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ ధర్నాలో హై స్కూల్ సాధన కమిటీ కో కన్వీనర్ బి. నర్సింగ్ రావు, ఎంఎస్‌‌‌‌‌‌‌‌సీ  కమిటీ చైర్మన్ పుల్లారావు, వైస్ చైర్మన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.