బంపర్ ఆఫర్ ప్రకటించినా.. ఆసక్తి చూపని వాహనదారులు

బంపర్ ఆఫర్ ప్రకటించినా.. ఆసక్తి చూపని వాహనదారులు

తెలంగాణలో పెండింగ్ చాలాన్లపై ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించినా.. వాహనాదారులు మాత్రం  పేమెంట్స్ కు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వాహనాదారులు ఈ ఆఫర్ ను వినియోగించుకునేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. పెండింగ్ చలాన్ల పేమెంట్ కు ఈరోజుతో గడువు ముగియనుంది. 

14 రోజుల్లో 32 శాతమే పేమెంట్ చాలాన్లు కట్టారు వాహనదారులు.  3 కోట్ల 59 లక్షల పెండింగ్ చాలాన్లు ఉంటే.. కోటీ 14 లక్షలు మాత్రమే క్లియర్ చేశారు వెహికిల్స్ యజమానులు. దీంతో రూ.100 కోట్ల వరకు ప్రభుత్వానికి  ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో 45 రోజుల్లో 60 శాతం చాలాన్లు క్లియర్ చేయడంతో 200 కోట్లు వచ్చాయి. జిల్లా, గ్రామాల్లో పెండింగ్ చలాన్ పేమెంట్స్ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.