రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా నిర్ణాయక పదవుల్లో సరైన వాటా దక్కడం లేదని, ఇందులో వీరి వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అగ్రవర్ణాల(ఓసీ) ఆధిపత్యం ఉండగా, అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం నామమాత్రంగా మిగిలింది. ప్రభుత్వ విధానాలను రూపొందించే ఉన్నత స్థాయి రాజకీయ పదవుల్లో కొన్ని సామాజిక వర్గాల వారే దశాబ్దాలుగా పాతుకుపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
8 శాతం మందికే కుల ధ్రువీకరణ పత్రాలు.. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా నిర్ణాయక పదవుల్లో సరైన వాటా దక్కడం లేదని, ఇందులో వీరి వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అగ్రవర్ణాల(ఓసీ) ఆధిపత్యం ఉండగా, అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం నామమాత్రంగా మిగిలింది. ప్రభుత్వ విధానాలను రూపొందించే ఉన్నత స్థాయి రాజకీయ పదవుల్లో కొన్ని సామాజిక వర్గాల వారే దశాబ్దాలుగా పాతుకుపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
రాజకీయ ప్రాతినిధ్యాన్ని శాసించే కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో కూడా తీవ్రమైన అసమానతలు ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది. రాష్ట్రంలో కేవలం 47.8 శాతం మందికి మాత్రమే కుల ధ్రువీకరణ పత్రాలు ఉండటం రాజకీయ హక్కుల వినియోగంపై ప్రభావం చూపుతోంది. రిజర్వ్‌డ్ స్థానాల్లో పోటీ చేయాలంటే ఈ పత్రం తప్పనిసరి. కానీ సగం మందికి ఇవి లేకపోవడం వారి రాజకీయ అవకాశాలను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గాల్లో ఈ పత్రాలు కలిగిన వారి శాతం(47.8) తక్కువగా ఉండటం వల్ల వారు రాజకీయంగా నష్టపోతున్నారని తేలింది.
►ALSO READ | రిజర్వేషన్లే లైఫ్ లైన్.. అవి లేకపోతే ఎస్సీ, ఎస్టీల ఉనికి కనుమరుగు !
ఎస్సీ, ఎస్టీలలో ఈ శాతం కొంత మెరుగ్గా ఉన్నా, ఇంకా 40 శాతం మందికి ఇవి అందకపోవడం వారి వెనుకబాటుతనానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది. కుల ధ్రువీకరణ పత్రాలు లేని వారు రాజకీయ హక్కుల సాధనలోనూ, ప్రభుత్వ పథకాల లబ్ధిలోనూ వెనుకబడుతున్నట్లుగా సర్వే పేర్కొంది. ఆర్థిక స్తోమతకు, రాజకీయ ప్రాతినిధ్యానికి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని కూడా వెల్లడించింది.
రాష్ట్రంలో 23.2 శాతం మంది వార్షిక ఆదాయం రూ. 50 వేల లోపు ఉండటంతో, వారు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారని తేలింది. రాజకీయం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో, కేవలం సంపన్న వర్గాలకే అధికారం దక్కుతోందని సర్వే అభిప్రాయపడింది.

