హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) 2026–-27 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిందని..ఇది జులై29 వరకూ కొనసాగుతుందని టాస్ డైరెక్టర్ కె. లింగయ్య తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా ఫైన్ తో ఆగస్టు 29 వరకు సమర్పించవచ్చని పేర్కొన్నారు. www.telanganaopenschool.org ని సందర్శించాలని ఆయన సూచించారు.
