అమరులైంది ఎవరి వల్ల..? : కేటీఆర్

అమరులైంది ఎవరి వల్ల..? : కేటీఆర్

 హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో వేలమంది ఎవరి వల్ల అమరులయ్యారని.. అమరు వీరుల స్తూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చిందని శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

 ‘‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాన్ని వేరుగానే ఉంచాలని, ఆంధ్రాతో కలపొద్దని పోరాడిన స్టూడెంట్లపై సిటీ కాలేజీ దగ్గర కాల్పులు జరిపింది ఎవరు..? 1969–-71 తొలిదశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు..? 1971 పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీని మాయం చేసింది ఎవరు..? రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పినట్టుగా వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు..?” అని కాంగ్రెస్ పై ట్విట్టర్ లో కేటీఆర్ విమర్శలు గుప్పించారు.