హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ కవాచ్

హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ కవాచ్
  • పలుచోట్ల 5 వేల మంది పోలీసుల తనిఖీలు
  • పాల్గొన్న సిటీ సీపీ సజ్జనార్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఆపరేషన్ కవాచ్ నిర్వహించారు. నగరంలోని 150 ప్రాంతాల్లో ఏకకాలంలో 5 వేల మంది పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. 

వాహనాలను తనిఖీ చేసి పేపర్లను పరిశీలించారు. సిటీ సీపీ సజ్జనార్​ కొన్ని ప్రాంతాల్లో స్వయంగా పాల్గొని వాహనాలను చెక్​ చేశారు. ఈ స్పెషల్​ డ్రైవ్‌‌లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఏఆర్​, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు పాల్గొన్నాయి.