ఎక్కువ మెడిసిన్ రాయించి.. బయట అమ్ముకుంటుండు

ఎక్కువ మెడిసిన్ రాయించి.. బయట అమ్ముకుంటుండు

మెహిదీపట్నం, వెలుగు: ఆపరేషన్ రోగులకు ప్రిస్కిప్షన్ లో ఎక్కువ మెడిసిన్​ రాయించి, వాటిలో కొన్ని దొంగిలించి బయట అధికరేట్లకు అమ్ముకుంటున్న టెక్నీషియన్ పట్టుబడ్డాడు. నిందితుడిని హబీబ్ నగర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. 

మహారాష్ట్రకు చెందిన హర్షత్ ముంతాజుద్దీన్ షేక్ (23) విజయనగర్ కాలనీలో ఉంటూ చాంద్రాయణ గుట్టలో పోరా మెడికల్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు చేస్తూ, హ్యుమానిటీ ఆస్పత్రిలో పార్ట్ టైం టెక్నీషియన్ గా చేస్తున్నాడు. ఆస్పత్రిలో రోగులకు ఆపరేషన్ చేసే సమయంలో  ప్రిస్కిప్షన్ లో  ఎక్కువగా మందులు రాసి, విలువైన వాటిని దొంగిలించి బయట అధిక ధరలకు అమ్ముతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.