
సోషల్ మీడియా పుణ్యామా అని ప్రతిరోజు వందల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఈ వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరికొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేవిగా కూడా ఉంటాయి. కొన్ని సార్లు ఎంత సీరియస్ పరిస్థితులలో ఉన్న కూడా వారు చేసిన పనుల వల్ల వారు ట్రెండింగ్ లో ఉంటారు. అచ్చం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
ఒక పేషెంట్ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేయించుకుంటున్నాడు. అతడికి చుట్టుపక్కల డాక్టర్లు, నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. చికిత్సకు సంబంధించిన మెటీరియల్ తప్ప ఎలాంటి వస్తువులకు అనుమతి ఉండదు. అంతేకాదు రోగి వద్ద కూడా ఎలాంటి వస్తువును ఉండనివ్వరు. కానీ ఈ రోగి మాత్రం ఆపరేషన్ థియేటర్‌లో బెడ్‌పై పడుకుని, గుట్కా నలిచాడు. రోగి గుట్కా నలిచిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకున్నట్లు ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి తెలిపాడు. అయితే అప్పటికే రోగికి అనస్థీషియా ఇచ్చారు. ఇక రోగి ఆక్సిజన్ మాస్కును కూడా ధరించాడు. ఎడమ చేతి వేలికి పల్స్ మెషీన్ కూడా ఉంది. ఒక నర్సు అతనికి ఇంజక్షన్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపించింది.
కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరు ప్రతిరోజు మద్యం తాగుతారు. మరికొందరు సిగరేట్ తాగుతారు.. ఇంకొందరు తంబాకు నములుతుంటారు. ఈ అలవాట్లకు చాలా అడిక్ట్ అయిపోతారు. ఇవి చేయకుంటే అస్సలు ఉండలేరు. ఇక్కడ కూడా ఒక వ్యక్తికి మరీ గుట్కా తినే అలవాటు ఉందా...?.. మరేంటో కానీ.. ఏకంగా ఐసీయూలో బెడ్ మీద గుట్కా ను చేతిలో తీసుకున్నారు. అంతటితో ఆగకుండా.. దాన్ని అటు ఇటు చేతిలో వేసుకుని గుట్కాను మిక్స్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేంది బాబోయ్.. ఐసీయూలో ఉన్నాడా.. కిళ్లీ కొట్టులో ఉన్నాడా..?అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అక్కడున్న వైద్యులు కూడా అతగాడికి మాత్రం వారించడం లేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Kanpur is not for beginners pic.twitter.com/HMDkUMkX5O
— Alpha? (@AlphaTwt_) February 19, 2024
@AlphaTwt అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 3.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``గుట్కా అతడికి మనోధైర్యాన్ని అందిస్తోంది``, ``ఆపరేషన్‌కు ముందు అతడు శక్తిని కూడగట్టుకుంటున్నాడు``, ``దురలవాట్ల ప్రభావం ఈ స్థాయిలో ఉంటుందా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.