V6 News

మోదీకి ఆదరణ పెరుగుతుందనే బిల్లును అడ్డుకున్నరు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

మోదీకి ఆదరణ పెరుగుతుందనే బిల్లును అడ్డుకున్నరు :  బీజేపీ ఎంపీ లక్ష్మణ్
  •     బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే విపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మహిళల హక్కులను కాలరాశాయని లక్ష్మణ్ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినప్పటికీ, రాజకీయ స్వార్థంతోనే ఈ బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. 

ఈ తప్పిదానికి కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ముఖ్యంగా దక్షిణాది ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైతే మొత్తం 850 స్థానాల్లో 33 శాతం రిజర్వేషన్ ద్వారా 280 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉండేదని తెలిపారు.