17న ప్రతిపక్షాల రెండో​ మీటింగ్

17న ప్రతిపక్షాల రెండో​ మీటింగ్
  • కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యేందుకు ప్రతిపక్షాలు ఈ నెల 17న భేటీ కానున్నాయి. జులై 17, 18వ తేదీల్లో బెంగళూరు వేదికగా విపక్షాల రెండో​ మీటింగ్​జరగనుందని కాంగ్రెస్​తెలిపింది. ఈమేరకు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ సోమవారం ప్రకటించారు. ఫాసిస్ట్​, అప్రజాస్వామిక శక్తులను ఓడించేందుకు తమ ప్రయత్నాలను వేగవంతం చేశామని ఆయన ట్వీట్​ చేశారు. కాగా, కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ జైరాం రమేశ్​మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ వాషింగ్​ మెషిన్​ ఐసీఈ (ఇన్​కం ట్యాక్స్, సీబీఐ, ఈడీ)లతో మళ్లీ స్టార్ట్​ అయ్యిందని ఆరోపించారు. జూన్​ 23న పాట్నాలో సమావేశమైన విపక్ష నేతలు ఈ రోజు మళ్లీ భేటీ కానున్నారని ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. 

ముంబై తరహా ఆపరేషన్లు బలోపేతమైతే వాటిని ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని ట్వీట్​ చేశారు. ‘మోదీ వాషింగ్​ పౌడర్​’ గా పేర్కొంటూ ప్రధాని ఫొటోతో ఉన్న వాషింగ్ ​పౌడర్​ ప్యాకెట్​ను జైరాం రమేశ్​ ట్యాగ్​చేశారు. కాగా, వేణుగోపాల్​ ట్వీట్​కు స్పందించిన టీఎంసీ నేత, రాజ్యసభ ఎంపీ ఒబ్రెయిన్​ ‘బెంగళూరు సమావేశం. అందరికోసం ఒక్కరు..ఒక్కరికోసం అందరు’ అని బదులిచ్చారు. అంతకుముందు ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​ జులై 13, 14 వ తేదీల్లో విపక్షాల రెండో మీటింగ్​ ఉంటుందని ప్రకటించినా, ఆ తేదీల్లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఈ నెల 17కు మార్చారు.