ఓపీఎస్లను జీపీఎస్లుగా మార్చాలి : రఘురాంరెడ్డి

ఓపీఎస్లను జీపీఎస్లుగా మార్చాలి : రఘురాంరెడ్డి
  • ఓపీఎస్​ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఘురాంరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా పనులు చేస్తున్నామని, జీతాల దగ్గరకు వచ్చేసరికి మాకు అన్యాయం జరుగుతుందని ఓపీఎస్​ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఘురాంరెడ్డి పేర్కొన్నారు.  హైదరాబాద్​లో ఆదివారం ఓపీఎస్​ల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించి, తమను జేపీఎస్‌‌‌‌లుగా మార్చాలని సీఎం రేవంత్​రెడ్డికి, మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. 2017 నోటిఫికేషన్ ద్వారా 9,355 జేపీఎస్ పోస్టులకు పరీక్ష నిర్వహించగా వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న సుమారు 2000 పోస్టుల్లో మెరిట్ లిస్ట్ ఆధారంగా మమ్మల్ని ఓపీఎస్‌‌‌‌లుగా తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం జేపీఎస్‌‌‌‌లకు నెలకు రూ.28,719 వేతనం అందుతుండగా.. ఓపీఎస్‌‌‌‌లకు 15,000 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.