‘దసరా’ నుంచి ‘ఓరి వారి’ ఆంథమ్‌‌

‘దసరా’ నుంచి ‘ఓరి వారి’ ఆంథమ్‌‌

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌‌.  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌ జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ధూమ్ ధామ్ సాంగ్‌‌, టీజర్‌‌‌‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెకెండ్ సాంగ్‌‌ రిలీజ్ డేట్‌‌ను గురువారం అనౌన్స్ చేశారు. వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందుగా, అంటే  ఫిబ్రవరి 13న ‘ఓరి వారి’ అనే హార్ట్‌‌బ్రేక్ ఆంథమ్‌‌ని విడుదల చేయనున్నట్టు చెప్పారు. మళ్లీ మళ్లీ వినేలా ఈ పాట ఉంటుందని ట్వీట్ చేశాడు నాని. పాత సైకిల్, పగిలిపోయిన కూలింగ్‌‌ గ్లాసెస్‌‌, టేప్‌‌ రికార్డర్‌‌‌‌, గాజు సీసాలు తగులుతున్న సౌండ్, వెలుగుతున్న లాంతర్లతో విడుదల చేసిన ప్రోమో వీడియో ఆకట్టుకుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 30న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా రిలీజ్ కానుంది.