
చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు సిద్ధమయ్యాడు సాయిరామ్ శంకర్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ఒక పథకం ప్రకారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కావడంతో... ఫుల్ మూవీపై ఆసక్తి నెలకొంది. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. అయితే సాయిరామ్‌కు జోడిగా అశీమా నర్వాల్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓసారిలా రా.. అనే సాంగ్ ను హీరో రామ్ పోతినేని విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన పాటలు ఎంతటి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ పాట కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా జూన్ 24న విడుదల కానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.