
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ రద్దు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కారు. కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ద్వారా ఎగ్జామ్స్ నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ పై తమకు నమ్మకం లేదని నినాదాలు చేశారు.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలవుతున్న ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా వేసిన పాపానపోలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అమాస, పున్నానికి వేసిన నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ.. మాలాంటి నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి ఉస్మానియా యూనివర్సీటీలో ఉంటూ... అమ్మానన్నలు అప్పులు చేసి పంపించిన డబ్బులతో చదువుకుంటుంటే, నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్ తమను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే టీఎస్పీఎస్సీని రద్దు చేసి.. కొత్త బోర్డ్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించుతామని హెచ్చరించారు.