ఓయూ హాస్టళ్లు, మెస్​ల పరిసరాలను క్లీన్ చేయాలి

ఓయూ హాస్టళ్లు,  మెస్​ల పరిసరాలను క్లీన్ చేయాలి
  •     చీఫ్ వార్డెన్​ను ఆదేశించిన వర్సిటీ వీసీ రవీందర్
  •     పాముకాటుకు గురైన పీహెచ్​డీ స్టూడెంట్​కు పరామర్శ

ఓయూ, వెలుగు: పాము కాటుకు గురై గాంధీ హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓయూ పీహెచ్​డీ ​స్టూడెంట్ విష్ణును ఉస్మానియా వర్సిటీ అధికారులు గురువారం పరామర్శించారు.  వీసీ ప్రొఫెసర్​ రవీందర్, రిజిస్ట్రార్​ప్రొఫెసర్ ​లక్ష్మీనారాయణ, చీఫ్ ​వార్డెన్ డాక్టర్ కొర్రెముల  శ్రీనివాస్​తో కలిసి గాంధీకి వెళ్లి విష్ణు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.  విష్ణుకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు వారు పేర్కొన్నారు. వర్షాలు పడుతున్నందున స్టూడెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

హాస్టళ్లు, మెస్​ల పరిసరాలను  క్లీన్ చేయించాలని చీఫ్ వార్డెన్​ను వీసీ రవీందర్ ఆదేశించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ ఆయా హాస్టళ్లు, మెస్​ల కేర్ టేకర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. హాస్టళ్లు, మెస్​ల పరిసరాలను క్లీన్​చేయాలని సిబ్బందికి సూచించారు. అవసరమైనచోట లైట్లు ఏర్పాటు చేయాలన్నారు.