 
                                    బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) విద్యార్థులు ర్యాలీ చేశారు. జగదీశ్‌రెడ్డికి శవయాత్ర నిర్వహించిన విద్యార్థి సంఘాలు.. దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దంగా స్పీకర్ పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ ను అవమానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
Also Read : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై మంత్రులు ఏమన్నారంటే
దళితులను ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి మోసం చేసి .. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దళితులని నిలువునా మోసం చేసి.. నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దళిత సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని ,దళితులు ఉన్నత పదవులలో ఉండడాన్ని చూసి ఓర్వలేక, బీఆర్ఎస్ నేత గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అనైతిక చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు.

 
         
                     
                     
                    