కొత్తపల్లి, వెలుగు: ఎస్సెస్సీ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించినట్లు స్కూల్ చైర్మన్ ఉప్పు లింగయ్య తెలిపారు. సిద్దార్థ 575 మార్కులతో స్కూల్ టాపర్గా నిలవగా, డి.భవిత్చంద్ర, ఇ.సాత్విక్, జి.హర్షణి572 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు.
8 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా మార్కులు సాధించారని చెప్పారు. 52 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 38 మంది 500కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు.
