తెలంగాణ రాష్ట్ర రాజకీయ దశ దిశ దుబ్బాక ఎలక్షన్ తో మారిందన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. హిందుత్వం అన్నది మతం కాదు జీవన శైలి అని అన్నారు. భైంసాలో దశాబ్దాలుగా హిందువుల పై దాడులు జరుగుతున్నాయన్నారు. హిందువునని చెప్పుకునే కేసీఆర్..పనికి మాలిన వారి కోసం హిందువుల పై దాడులు చేయిస్తున్నాడని వివర్శించారు. పరాయి వాన్ని పొలిమేర వరకు తరిమి కొట్టు, మనవాడే మోసం చేస్తే బొంద పెట్టు అన్న కాళోజీ సామెత కేసీఆర్ కు వర్తిస్తుందన్నారు.
జమ్ము కశ్మీర్ లోని పండిత్ లకు ప్రధాన మంత్రి మోడీ వల్లనే న్యాయం జరిగిందన్నారు అర్వింద్. ఆర్టికల్ 370 రద్దుతో పండితులు తిరిగి కశ్మీర్ చేరుకున్నారని తెలిపారు. భైంసా మరో కాశ్మీర్ గా మారిందని..కశ్మీర్ మాదిరి గానే భైంసా లో కూడా హిందువులు భైంసా ను వదిలి వెళ్తున్నారని అన్నారు. భైంసా నుండి హిందువులను తరిమి కొట్టే ప్లాన్ ఓవైసీ అధ్వర్యంలో కేసీఆర్ నడిపిస్తున్నారని చెప్పారు. ఓవైసీ పెంపుడు కుక్క కేసీఆర్ అంటూ ఘాటుగా విమర్శించారు. భైంసాలో సెక్యులరిజం పేరుతో కేసులు పెడుతున్నారని..ముస్లింలకు కండిషన్ లేకుండా బెయిల్ వస్తే.. మన వాళ్లకు కండిషన్ బెయిల్ యిస్తున్నారన్నారు. నిజామాబాద్ లో 40 మంది రోహింగ్యాలకు పాస్ పోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కేసీఆర్ కనుసన్నల్లో జరుగుతోందన్నారు. నిర్మల్, నిజామాబాద్ ఐపీఎస్ అధికారులు గులాబీ కండువా వేసుకుని పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అర్వింద్.
