V6 News

ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనే వడ్ల కొనుగోళ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనే వడ్ల కొనుగోళ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కోహెడ, వెలుగు : రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోళ్లను ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలోనే జరపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వడ్ల కొనుగోళ్లలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో తాగు నీటిసమస్య రాకుండా చూసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 

మండలాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతకుముందు పార్టీ కార్యకర్తల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ... గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీలు వేయాలని సూచించారు. ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొంగ ఓటర్లు నమోదు కాకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో పీసీసీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సౌజన్య, ఏఎంసీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మల, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు ధర్మయ్య, సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

సేంద్రియ ఎరువులు వినియోగం పెంచండి 

కరీంనగర్ (చిగురుమామిడి), వెలుగు : రైతులు సేంద్రియ ఎరువులు వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తక్కువ యూరియా వాడాలని, సాగు ఖర్చు తగ్గించాలని సూచించారు. పంట మార్పిడి పాటిస్తూ సుస్థిర ఆదాయాన్ని, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిరాకీ ఉన్న రకాలనే సాగు చేయాలని చెప్పారు. 

కార్యక్రమంలో అగ్రికల్చరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝాన్సీ, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.