Pak vs UAE: మనసు మార్చుకున్న పాకిస్థాన్..UAEతో మ్యాచ్ ఆలస్యం

Pak vs UAE: మనసు మార్చుకున్న పాకిస్థాన్..UAEతో మ్యాచ్ ఆలస్యం

భారత్​ తో షేక్​ హ్యాండ్స్​ వివాదంతో UAE తో మ్యాచ్​ రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్ మనసు మార్చుకుంది..మ్యాచ్​ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్​ ప్రకారం బుధవారం (సెప్టెంబర్​17) రాత్రి 8గంటలకు మ్యాచ్​ఉండగా తమ ప్లేయర్లను హోటల్​ గదుల్లో ఉండాలని పాకిస్తాన్​ క్రికెట్​ బోర్డు ఆదేశించడంతో యూఏఈతో మ్యాచ్​ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. 

కొద్ది గంటల్లోనే పాకిస్తాన్​ మనసు మార్చుకొని ప్లేయర్లను స్టేడియానికి వెళ్లాలని సూచించడం.. పాకిస్తాన్​ ప్లేయర్లంతా స్టేడియానికి బయల్దేరడంతో ఆటకు లైన్​ క్లియర్​ అయింది. 8గంటలకు ప్రారంమ్యాచ్​ ఆలస్యంగా ప్రారంభం కానుంది. 

ఇటీవల భారత్‌తో జరిగిన హ్యాండ్‌షేక్ వివాదం క్రమంలో ఆసియా కప్‌లో UAE తో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. హ్యాండ్‌షేక్ వివాదంలో భారత్​ పక్షాన నిలిచారని ఆరోపిస్తూ ఐసిసి మ్యాచ్ రిఫరీ ఆండీపై క్రాఫ్ట్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

అయితే జియో న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం..పాకిస్తాన్ డిమాండ్‌ను ఐసిసి తిరస్కరించింది. మరోవైపు పీసీబీ జాతీయ జట్టు సభ్యులను హోటల్‌లోనే ఉండాలని,యుఎఇతో జరిగే మ్యాచ్ కోసం వేదికకు వెళ్లొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లను వారి హోటల్ గదుల్లోనే ఉండమని చెప్పడం మ్యాచ్​ బహిష్కరించాలనే నిర్ణయంగా తెలుస్తోంది. 

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. UAE జట్టు అప్పటికే స్టేడియానికి బయలుదేరింది.