PAK vs NZ: సీఎస్‌కే ఆల్‌రౌండర్‌కు విశ్రాంతి.. పాకిస్తాన్‌తో తలపడే న్యూజిలాండ్ జట్టు ఇదే

PAK vs NZ: సీఎస్‌కే ఆల్‌రౌండర్‌కు విశ్రాంతి.. పాకిస్తాన్‌తో తలపడే న్యూజిలాండ్ జట్టు ఇదే

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయం కారణంగా సుదీర్ఘకాలం పాటు ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమైన కేన్ విలియమ్సన్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ,  స్టార్ డెవాన్ కాన్వే తిరిగిరాగా.. కివీస్ యువ ఆల్‌రౌండర్‌, సీఎస్‌కే ఆటగాడు రచిన్ రవీంద్రకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ జనవరి 12 నుంచి ప్రారంభంకానుంది.

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్సన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్ , ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్.

న్యూజిలాండ్ vs పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ షెడ్యూల్:

  • మొదటి టీ20 (జనవరి 12): ఈడెన్ పార్క్ (ఆక్లాండ్)
  • రెండో టీ20 (జనవరి 14): సెడాన్ పార్క్ ( హామిల్టన్)
  • మూడో టీ20 (జనవరి 17): యూనివర్సిటీ ఓవల్ (డునెడిన్) 
  • నాలుగో టీ20 (జనవరి 19): హాగ్లీ ఓవల్ (క్రైస్ట్‌చర్చ్) 
  • ఐదవ టీ20 (జనవరి 21: హాగ్లీ ఓవల్ (క్రైస్ట్‌చర్చ్)