ఎంపిక కాలేదని బౌలర్ ఆత్మహత్యాయత్నం

ఎంపిక కాలేదని బౌలర్ ఆత్మహత్యాయత్నం

ఇంటర్ సిటీ ఛాంపియన్ షిప్‌‌కు ఎంపిక కాలేదని ఓ క్రీడాకారుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. తన సొంత జట్టుకు ఎంపిక కాలేకపోవడంతో అతను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ ఘటన పాక్ దేశంలో చోటు చేసుకుంది. దక్షిణ సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ ప్రాంతంలో షోయబ్ అనే క్రీడాకారుడు నివాసం ఉంటున్నాడు.  క్రికెట్ ఇంటర్ సిటీ ఛాంపియన్ షిప్ కోసం ట్రయల్స్ ఎంపిక జరుగుతోంది. కానీ.. అతని కోచ్ ఎంపిక చేయకపోవడంతో షోయబ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

నిరాశ కారణంగా తన గదికే పరిమితమయ్యాడని అతని కుటుంబసభ్యులు వెల్లడించారు. అనుమానం వచ్చి చూడగా గదిలోని బాత్రూమ్‌‌లో మణికట్టు కోసుకుని అపస్మారకస్థితిలో ఉండడం చూశామన్నారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కరాచీకి చెందిన అండర్ 19 క్రికెటర్ మొహ్మద్ ను జర్యాబ్ సిటీ అండర్ 19 జట్టు నుంచి తొలగించడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన 2018, ఫిబ్రవరిలో చోటు చేసుకుంది.