
పాకిస్థాన్ పెషావర్‌లోని వార్సాక్ రోడ్‌లో డిసెంబర్ 4న ఉదయం ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు గాయపడ్డారు. పాకిస్థానీ ఇంగ్లీష్ డైలీ, డాన్ కథనం ప్రకారం, ఈ సంఘటన పెషావర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉదయం 9:10 గంటలకు జరిగింది. రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బ్లాక్ లో అమర్చిన నాలుగు కిలోగ్రాముల పేలుడు పదార్థాలను పేలుడుకు ఉపయోగించినట్లు వార్సాక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్షద్ ఖాన్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, తదుపరి విచారణ జరుగుతోందని ఖాన్ చెప్పారు.
అందరూ 11 - 23 సంవత్సరాల మధ్య వయస్సు గలవారేనని ఖాన్ పేర్కొన్నాడు. అంతే కాదు పిల్లలెవరూ పాఠశాల యూనిఫాం ధరించలేదని చెప్పారు. ఈ క్రమంలోనే కేర్‌టేకర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి జస్టిస్ (రిటైర్డ్) అర్షద్ హుస్సేన్ షా ఈ ఘటనను ఖండించారు.పేలుడుపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరారు.
2014లో, పాకిస్తానీ తాలిబాన్లు.. వాయువ్య నగరం పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS)పై దాడి చేసి 131 మంది విద్యార్థులతో సహా కనీసం 150 మందిని చంపేశారు. ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.