
ఇస్లామాబాద్: ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. 2025, సెప్టెంబర్ 12 జరగనున్న ఈ చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా, అతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా జట్టుకు హెచ్చరికలు పంపాడు పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్. ఆసియా కప్‌లో తమ జట్టు భారత్‌తో పాటు ఏ ప్రత్యర్థినైనా ఓడించడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రగల్భాలు పలికారు. భారతదేశాన్ని ఓడించే సామర్థ్యం తమ జట్టుకు ఉందని జావేద్ పేర్కొన్నారు.
‘‘ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించే సామర్థ్యం మా జట్టుకు ఉంది. మా జట్టు ఏ ప్రత్యర్థినైనా ఓడించగలదు. మీకు నచ్చినా నచ్చకపోయినా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్దది. ఇది ప్రతి ఆటగాడికి తెలుసు. భారత్ పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్‌పై కచ్చితంగా గెలవాలని మా ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి పెట్టం’’ అన్నారు ఆకిబ్ జావేద్
కాగా.. 2025, సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికగా ఆసియా కప్ 2025 ఎడిషన్ జరగనుంది. ఈ సారి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్‌లో పాకిస్తాన్, ఇండియా, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్ ఏలో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్ 2025 కోసం ఆదివారం (ఆగస్ట్ 17) పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది.
►ALSO READ | ఆసియా కప్‌కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్స్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ఔట్
17 మంది ఆటగాళ్లతో టీమ్‌ను అనౌన్స్ చేసింది. స్టార్ ప్లేయర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌లకు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 12న ఒమన్‌తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్, భారత్ తలపడనున్నాయి.
ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, హసన్ అలీ , హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ వపెర్జ్, మొహమ్మద్ వాపెర్జ్ (వికెట్, మొహమ్మద్ వాపెర్జ్), సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్.