
ఇస్లామాబాద్: ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. మొత్తం 16 మందితో కూడిన స్క్వాడ్‌ను అనౌన్స్ చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. స్టార్ ప్లేయర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరిని ఆసియా కప్ కోసం ఎంపిక చేయకుండా మొండిచేయి చూపించింది. తద్వారా పాకిస్థాన్ క్రికెట్లో గ్రేట్ ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బాబర్ అజామ్ 8 సంవత్సరాల తర్వాత తొలిసారి జట్టుకు దూరమయ్యాడు.
పాక్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌కు కూడా ఆసియా కప్ జట్టు నుంచి ఉద్వాసన పలికింది పీసీబీ. గతకొంత కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతుండటంతోనే ఈ ఇద్దరూ సీనియర్లను పక్కకు పెట్టినట్లు పీసీబీ స్పష్టం చేసింది. యంగ్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘాకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, హసన్ అలీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆసియా కప్ జట్టులో స్థానం దక్కించుకున్నారు.
కాగా.. 2025, సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికగా ఆసియా కప్ 2025 ఎడిషన్ జరగనుంది. ఈ సారి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్లోపాకిస్తాన్, ఇండియా, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్ ఏలో తలపడనున్నాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 12న ఒమన్‌తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్, భారత్ తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ కోసం ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్సే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఆసియా కప్‌లో భారత్ పాక్ ఆడనున్న మ్యాచ్‌పై సంధిగ్ధం నెలకొంది. ఇటీవల భారత్ పాకిస్థాన్ మధ్య చోటు చేసుకున్న సైనిక ఘర్షణల వల్ల భారత్ ఈ మ్యాచును బైకాట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం క్రికెట్ ప్రియులకు తీవ్ర నిరాశ అనే చెప్పవచ్చు.
ఆసియా కప్ 2025 పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, హసన్ అలీ , హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ వపెర్జ్, మొహమ్మద్ వాపెర్జ్ (వికెట్, మొహమ్మద్ వాపెర్జ్), సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్.