
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అండర్-18 బాస్కెట్‌బాల్ స్టేట్ లెవెల్ కోచింగ్ క్యాంప్ హైదరాబాద్‌లోని వోక్సెన్ యూనివర్సిటీలో ప్రారంభమైంది. జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్స్ కోసం ప్లేయర్లను సిద్ధం చేయడానికి తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (టీబీఏ), వోక్సెన్ ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ట్రయల్స్‌లో ఎంపికైన 24 మంది అబ్బాయిలు, 25 మంది అమ్మాయిలు ఈ నెల 30వ తేదీ వరకు జరిగే క్యాంప్‌లో శిక్షణ పొందుతున్నారు.
కోచ్‌లు అమృత్ రాజ్, ఏసు, పవన్ ఆధ్వర్యంలో జరిగే ట్రెయినింగ్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ చేసిన ప్లేయర్లను జూనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు సెలెక్ట్ చేస్తామని టీబీసీ సెక్రటరీ పృధ్వీశ్వర్ రెడ్డి, వోక్సెన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రౌల్ వి. రోడ్రిగేజ్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ విశాల్ తెలిపారు.