
ఆసియా కప్ 2025కు ముందు ట్రై సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 29 నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టీ20 ఫార్మాట్ లో ముక్కోణపు సిరీస్ ఆడనున్నాయి. ఈ ట్రై సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం (ఆగస్టు 1) రిలీజ్ అయింది. 2024 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనలిస్టులైన ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్తాన్ టోర్నీ తొలి మ్యాచ్ లో తలబడనున్నాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో రెండుసార్లు తలపడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 7 న జరగబోయే ఫైనల్ ఆడతాయి.
షార్జా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ లన్ని జరగనున్నాయి. ఈ సిరీస్ పాకిస్థాన్ కు పెద్ద పరీక్షగా మారనుంది. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత విజయాలను సాధిస్తోంది. మరోవైపు యూఏఈ బంగ్లాదేశ్ పై సిరీస్ గెలిచి ఊపు మీద ఉంది. దీంతో పాకిస్థాన్ మిగిలిన రెండు జట్ల నుంచి ఛాలెంజ్ ఎదురు కానుంది. ప్రస్తుతం పాకిస్తాన్ వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇటీవలే బంగ్లాదేశ్‌తో 1-2 తేడాతో పాకిస్థాన్ ఓడిపోవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ చివరిసారిగా డిసెంబర్‌లో టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ లో జింబాబ్వేను 2-1 తేడాతో ఓడించింది.
ఆసియా కప్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. టీమిండియా సెప్టెంబర్ 10న యూఈఏతో, 14న పాకిస్తాన్‌తో, 19న ఒమన్‌తో పోటీపడనుంది.
ట్రై-సిరీస్ షెడ్యూల్:
ఆగస్టు 29 – ఆఫ్ఘనిస్తాన్ vs పాకిస్తాన్
ఆగస్టు 30 – యుఏఈ vs పాకిస్తాన్
సెప్టెంబర్ 1 – యుఏఈ vs ఆఫ్ఘనిస్తాన్
సెప్టెంబర్ 2 - పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్
సెప్టెంబర్ 4 - పాకిస్తాన్ vs యుఎఇ
సెప్టెంబర్ 5 – ఆఫ్ఘనిస్తాన్ vs యుఎఇ
సెప్టెంబర్ 7 – ఫైనల్
A precursor to the men's T20 Asia Cup for UAE, Pakistan and Afghanistan, with a tri-series starting August 29 🏏
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
Read more 👉 https://t.co/oDRdFQcrCX pic.twitter.com/8gk6yB7ct7