
ఆసియా కప్ లో మంగళవారం (సెప్టెంబర్ 14)న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్నాయి మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో రెండు జట్లు తమ తొలి మ్యాచ్ లో భారీ విజయం సాధించి బరిలోకి దిగుతున్నాయి. ఇండియా మ్యాచ్ లో 93 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేజ్ చేసి యూఏఈని చిత్తు చేశారు. మరోవైపు పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్ లో ఒమన్ పై 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు.
రెండు జట్లకు భారీగా నెట్ రన్రేట్ ఉండడంతో ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు దాదాపుగా సూపర్-4 బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇండియా, పాకిస్థాన్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్