టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘పళ్లిచట్టంబి’. నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించారు. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత చాణక్య మాట్లాడుతూ ‘మాకున్న కొద్దిపాటి అనుభవంతో ఇలాంటి ఓ భారీ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. మలయాళంలో హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీస్‌తో కలిసి చూస్తున్నారు. ఇక్కడ కూడా బిగ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు.
మరో నిర్మాత చరణ్ మాట్లాడుతూ ‘ఒకటిన్నర ఏడాదిగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. 2 వేల మంది 130 రోజులు వర్క్ చేశారు. హీరో టొవినో థామస్, డైరెక్టర్ డిజో జోస్ చాలా సపోర్ట్ చేశారు’ అని చెప్పారు. ‘మలయాళంలో మాసివ్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ కూడా అంతే విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్టు ప్రొడ్యూసర్ చైతన్య చెప్పారు. ఈ సంస్థ నుంచి తెలుగులోనూ మంచి మూవీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ చెప్పారు.

