పెరిగిన జీతాలు ఇస్తలేరు.. జీవోలో రూ.41,500.. చేతికొచ్చేది రూ. 27,200

పెరిగిన జీతాలు ఇస్తలేరు.. జీవోలో రూ.41,500.. చేతికొచ్చేది రూ. 27,200
  • పంచాయతీరాజ్​శాఖ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ల ఆవేదన 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లకు పెరిగిన జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన వేతనాలపై ఆర్థిక శాఖ  జీవో జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను నోటిఫై చేయడంతో పాటు వారికి కొత్త వేతనాలను ఖరారు చేసిందని, ఇందులో ఈ -పంచాయతీ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లకు నెలకు రూ. 41,500 ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని తెలిపారు. కానీ తమకు ఇంకా పాత జీతం రూ.27,200 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన జీతాలు ఇవ్వకపోవడంతో నెలకు ఏకంగా రూ.14,300 చొప్పున నష్టపోతున్నామని వాపోయారు. కాగా పెరిగిన వేతనాలను ఐఎఫ్ఎంఐఎస్​పోర్టల్‌‌లో అప్‌‌డేట్ చేయాల్సి ఉండగా.. డేటాను పంపడంలో పంచాయతీరాజ్ శాఖ జాప్యం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.