బీఫామ్‌‌‌‌ ఇచ్చి మోసం చేశారని ఆందోళన

బీఫామ్‌‌‌‌ ఇచ్చి  మోసం చేశారని ఆందోళన

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపాలిటీ 48వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు తనకు బీ-ఫామ్ ఇవ్వడంతో పాటు మరొకరికి సైతం చివరి సమయంలో బీ-ఫామ్ ఇచ్చి తనను మోసం చేశారని పందిరి అనిత మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి తనకే కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇస్తారని ఆశించి ప్రచారం చేపట్టానన్నారు. అనుకున్నట్లుగానే తనకు కాంగ్రెస్ పార్టీ నుండి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బీ-ఫామ్ ఇవ్వగా నామినేషన్ వేశానన్నారు. అప్పటికప్పుడు తనకు కాకుండా మరొకరికి బీ-ఫామ్‌ను ఇవ్వడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.