‘రంగరంగ వైభవంగా’ టీజర్ డేట్ ఫిక్స్

‘రంగరంగ వైభవంగా’ టీజర్ డేట్ ఫిక్స్

ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ హీరో పంజా వైష్ణవ్ రంగరంగ వైభవంగా  అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  వైష్ణవ్ సరసన అందాల భామ కేతిక శర్మ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాను డైరెక్టర్  గిరీశాయ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. రంగరంగ వైభవంగా మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు శనివారం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై  ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలవగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీగా తెరకెక్కుతున్న రంగరంగ వైభవంగా  జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఉప్పెన, కొండపొలం మూవీస్ తో మంచి సక్సెస్ లు అందుకున్న వైష్ణవ్ తేజ్, ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో చూడాలి.