తిరువీర్ హీరోగా ఎస్.పి.దుర్గ నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించిన చిత్రం ‘పాపం ప్రతాప్’. ఏప్రిల్ 17న థియేటర్స్‌లో విడుదల కానుంది. బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్. ఇందులో తిరువీర్ వీర ప్రతాపం చూపిస్తాడు. ఈ మూవీ టికెట్ 99 రూపాయలు మాత్రమే పెట్టారు.
ఆడియెన్స్ బయట ఎండల్లో కాకుండా థియేటర్స్‌లో ఈ మూవీ చూస్తూ కూల్ అవుతారని ఆశిస్తున్నా’ అని అన్నాడు. కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ నందిని రెడ్డి, రైటర్ కోన వెంకట్ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే ఫీల్ గుడ్ సినిమా ఇదని, ఎవర్నీ డిజప్పాయింట్ చేయదని తిరువీర్ అన్నాడు.
ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ అని డైరెక్టర్ దుర్గ నరేష్ అన్నాడు. వంద రూపాయలకే రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా ఉంటుందని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.

