త్వరలో డిస్నీప్లస్ హాట్ స్టార్ లో 'పరంపర' 2

త్వరలో  డిస్నీప్లస్ హాట్ స్టార్ లో 'పరంపర' 2

గత కొన్ని రోజుల వరకూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ పరంపర ఎంత సక్సెస్ ను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పరంపర 2 సీజన్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. పొలిటికల్ రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. గతేడాది స్ట్రీమింగ్ అయ్యి.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది.  కాగా ఇవే స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఉండబోతుందని నిర్వాహకులు వెల్లడించారు. అయితే త్వరలోనే పరంపర సీజన్ 2కి సంబంధించిన వివరాలు కూడా ప్రకటిస్తామని వెబ్ సిరీస్ బృందం చెప్పింది.