
గేమ్స్ విలేజ్‌లో సరైన ఆహారం దొరకడం లేదని వాపోతున్న ఇండియా షూటర్లకు చటౌరోక్స్‌లోని ‘తాజ్‌మహల్, బాంబే’ రెస్టారెంట్లు వరంగా మారాయి. ఈ రెండు ఫుడ్ కోర్టులు మన షూటర్లకు అవసరమైన ఇంటి భోజనాన్ని అందిస్తున్నాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన అతిఫ్ నొమన్ తాజ్‌మహల్ పేరుతో చటౌరోక్స్ సెంటర్‌లో రెస్టారెంట్‌ను నడిపిస్తున్నారు. ఇందులో ఇండియన్ ఫుడ్ లభిస్తుండటంతో ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్‌తో పాటు ఇతర షూటర్లు
కోచ్‌లు రెస్టారెంట్‌కు బారులు తీరారు. టీవీలో భాకర్ గెలుపును చూసిన అతిఫ్.. షూటర్‌కు మంచి అతిథి మర్యాదలు కూడా చేశారు. రెగ్యులర్‌గా లభించే మటర్ పనీర్, దాల్ మఖనీ, పాలక్ పనీర్‌ను వండించుకుని ప్లెయిన్ నాన్‌తో కలిసి మన అథ్లెట్లు బ్యాచ్‌ల వారీగా వచ్చి ఆరగిస్తున్నారు. తాజ్‌మహల్‌కు 300 మీటర్ల దూరంలో బాంబే పేరుతో మరో రెస్టారెంట్ కూడా ఉంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన మహ్మద్ హమ్జా 38 ఏళ్ల నుంచి ఇక్కడ ఇండియన్ ఫుడ్‌ను అందిస్తున్నారు.