- క్లబ్ త్రోలో ఇండియాకు గోల్డ్, సిల్వర్
- 100 మీ. పరుగులో సిమ్రన్‌కు నాలుగో ప్లేస్
- ఆర్చరీ, షూటింగ్, లిఫ్టింగ్‌లో నిరాశ
పారిస్ : పారాలింపిక్స్‌లో ఇండియన్ పారాలింపియన్ల పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతోంది. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన జూడోకా కపిల్ పర్మార్ బ్రాంజ్ మెడల్‌తో మెరిశాడు. గురువారం జరిగిన మెన్స్ 60 కేజీ (జే1) బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్‌లో కపిల్10–0 ఎలిల్టన్ డి ఒలివేరియా (బ్రెజిల్)పై నెగ్గాడు. పారాలింపిక్స్ జూడోలో ఇండియాకు ఇది తొలి పతకం కావడం విశేషం. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 1–10తో బనితాబ కోర్రమ్ అబాడీ (ఇరాన్) చేతిలో ఓడిన కపిల్ క్వార్టర్స్‌లో 10–0తో మార్కో డెన్నిస్ బ్లాంకో (వెనిజులా)పై గెలిచాడు.
అయితే ఈ రెండు పోటీల్లో కపిల్ ఎల్లో కార్డుకు గురైనా తిరిగి అద్భుతమైన పట్టుతో ఆకట్టుకున్నాడు. అతి తక్కువ కంటి చూపు కలిగిన అథ్లెట్లు జే1 కేటగిరీలో పోటీపడతారు. మధ్యప్రదేశ్‌లోని శివోర్ గ్రామానికి చెందిన కపిల్ పర్మార్ బాల్యంలో జరిగిన ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయాడు. పొలంలో ఆడుకుంటున్న సమయంలో నీటి పంపును తాకడంతో విద్యుద్ఘాతానికి గురై కోమాలోకి వెళ్లాడు. ఈ ప్రమాదంలో అతని కంటి చూపు బాగా దెబ్బతిన్నది.
2017లో బ్లైండ్ జూడోలోకి వచ్చిన కపిల్ 2018లో నేషనల్ చాంపియన్‌షిప్, 2019లో కామన్వెల్త్ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఇక విమెన్స్ 48 కేజీల్లో (జే 2 కేటగిరీ) కోకిల క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. 0–10తో నౌబెక్ అక్మరల్ (కజకిస్తాన్) చేతిలో ఓడింది. తర్వాత జరిగిన రెపీఛేజ్ రౌండ్‌లోనూ 0–10తో యూలియా (ఉక్రెయిన్) చేతిలో పరాజయంపాలైంది.
ఒక్క పాయింట్ తేడాతో..
ఇండియన్ ఆర్చర్లు హర్విందర్ సింగ్–పూజ జత్యాన్ ఒక్క పాయింట్ తేడాలో బ్రాంజ్ మెడల్‌ను కోల్పోయారు. మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ కేటగిరీ బ్రాంజ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో హర్విందర్–పూజ 4–5 తేడాతో లావ్రినెన్స్ జివా–ఫ్యాబిక్ డిజాన్ (స్లొవేనియా) చేతిలో ఓడారు. ఓ దశలో ఇరుజట్లు 4–4తో సమంగా నిలిచాయి. కానీ షూటాఫ్‌లో ఇండియన్ ఆర్చర్లు 17 పాయింట్లకే పరిమితం కాగా
స్లొవేనియా ఆర్చర్లు 19 పాయింట్లు నెగ్గారు. దీంతో ఒక్క సెట్‌తో బ్రాంజ్‌ను గెలిచారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో ఇండియన్ ఆర్చర్లు 6–0తో మిలెనా ఒల్జావాస్కా–లుకాస్ సిస్‌జెక్ (పోలెండ్)పై గెలవగా, సెమీస్‌లో 2–6తో టాప్ సీడ్ ఎలిజబెటా మిజ్నో–స్టెఫానో ట్రావిసాని చేతిలో ఓడారు.
బుల్లెట్ దిగలే..
మిక్స్‌డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1)లో ఇండియా షూటర్లు మోనా అగర్వాల్, సిద్ధార్థ బాబు నిరాశపర్చారు. గురువారం జరిగిన క్వాలిఫికేషన్‌లో మోనా 615.8 పాయింట్లతో 30వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఆరు సిరీస్‌ల్లో మోనా వరుసగా 104.5, 100.8, 99.2, 101.9, 101.7, 102.4 పాయింట్లు సాధించింది. ఇక సిద్ధార్థ 615.8 పాయింట్లతో 22వ ప్లేస్‌కు పరిమితమయ్యాడు. 10 షాట్స్‌తో కూడిన ఆరు సిరీస్‌ల్లో కలిపి సిద్ధార్థ 101, 102, 103.1, 104.6, 101.7, 103.4 పాయింట్లు తెచ్చాడు. స్పెయిన్ షూటర్ జువాన్ అంటోనియో రినాల్డో 626.9 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించింది. ఇండియా పారా స్ప్రింటర్ సిమ్రన్..
విమెన్స్ 100 మీటర్ల టీ12 ఫైనల్లో ఆకట్టుకోలేకపోయింది. 12.31 సెకన్ల టైమింగ్‌తో నాలుగో ప్లేస్‌లో నిలిచింది. డురాండ్ ఎలిసా ఒమరా (క్యూబా, 11.81 సె), బొటర్చుక్ ఒక్సానా (ఉక్రెయిన్, 12.17 సె), ముల్లెర్ కత్రిన్ (జర్మనీ, 12.26 సె) వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ గెలిచారు. మెన్స్ 65 కేజీ పవర్ లిఫ్టింగ్‌లో అశోక్ 199 కేజీల బరువు ఎత్తి ఆరో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో ఇండియన్ లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తడంలో ఫెయిలయ్యాడు.
ధరంబీర్ పసిడి’ త్రో
పారాలింపిక్స్ మెన్స్ క్లబ్ త్రోలో ఇండియా అథ్లెట్లు గోల్డ్, సిల్వర్‌తో మెరిశారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ ఎఫ్–51 ఫైనల్లో ధరంబీర్ సింగ్ 34.92 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఐదో ప్రయత్నంలో అతను ఈ దూరాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో ఆసియా రికార్డును బద్దలుకొట్టాడు. ప్రణవ్ సూర్మ 34.59 మీటర్ల దూరంతో రెండో ప్లేస్‌లో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు.
తొలి ప్రయత్నంలో ప్రణవ్ ఈ దూరాన్ని నమోదు చేసినా తర్వాతి ప్రయత్నాల్లో అతను దీన్ని అధిగమించలేకపోయాడు. ఇండియాకే చెందిన అమిత్ కుమార్ సారోహ 23.96 మీటర్ల దూరంతో ఆఖరి ప్లేస్‌లో నిలిచాడు. ఫిలిప్ గ్రావోచ్ (సెర్బియా, 34.18 మీ)కు బ్రాంజ్ మెడల్ లభించింది.