దగ్గుతున్నాడని బస్సులోంచి దింపేసిన్రు.. కాసేపటికే రోడ్డుపై మృతి

దగ్గుతున్నాడని బస్సులోంచి దింపేసిన్రు.. కాసేపటికే రోడ్డుపై మృతి

ట్రీట్​మెంట్​ అందక మృతి
చేగుంట, వెలుగు: సకాలంలో ట్రీట్​మెంట్​ అందక ఓ అస్తమా పేషెంట్ ​మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం మెదక్ జిల్లా చేగుంటలో జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఆర్టీసీ బస్సులో నేరేడ్​మెట్​కు చెందిన శ్రీనివాస్ బాబు(54) వెళ్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో తోటి ప్రయాణికులు మెదక్​ జిల్లా చేగుంట సమీపంలో రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ దగ్గర బస్సులోంచి ఆయనను దింపేశారు. చేగుంట పట్టణం వైపు నడుచుకుంటూ వెళ్లిన ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కిందపడిపోయారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చుట్టుపక్కల వాళ్లకు చెప్పడంతో కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానించి పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేసరికే ఆయన మృతిచెందారు. శ్రీనివాస్ బాబుకు ఆస్తమా ఉందని కుటుంబీకులు తెలిపారు.

For More News..

ఈ మందుతో కరోనా పరారంట

హైదరాబాద్లో ఇట్లయితే కష్టం

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!

బతుకు భరోసా లేని జర్నలిస్టులు