బషీర్‌బాగ్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన పసుపులేటి పవన్‌ను మాల మహానాడు యూత్ వింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య తెలిపారు. ఈ నియామక పత్రాన్ని బుధవారం హైదరాబాద్‌లో అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా జి.చెన్నయ్య మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాల యువతను సంఘటితం చేస్తూ వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని పవన్‌కు సూచించారు.
యువతను ప్రోత్సహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, మాల సమాజ అభివృద్ధి కోసం ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.రంజిత్ కుమార్ మంద, యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.సుధాకర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి.రమేశ్, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ బాలకృష్ణ, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
