Cricket World Cup 2023: పిచ్ ఫొటోలు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్.. AIతో ఏమైనా చేస్తున్నావా ఏంటీ..

Cricket World Cup 2023: పిచ్ ఫొటోలు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్.. AIతో ఏమైనా చేస్తున్నావా ఏంటీ..

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు కొన్ని గంటలు మాత్రమే ఉంది.. కప్ యుద్ధానికి అంతా సిద్ధం.. గ్రౌండ్ లోని పిచ్ కూడా రెడీ అయ్యింది. ఫైనల్ మ్యాచ్ ముందు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్.. పిచ్ మొత్తాన్ని ఫొటోలు తీయటం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఎవరూ ఇలా చేయలేదు.. జస్ట్ వచ్చి చూస్తారు.. చేతులు, కాళ్లతో పరిశీలిస్తారు.. బౌలింగ్ చేస్తారు.. బ్యాటింగ్ చేస్తారు.. ఈ రకంగా పరిశీలిస్తారు పిచ్ ను..

ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్.. పిచ్ మొత్తాన్ని తన ఫోన్ లో ఫొటోలు తీయటం ఆసక్తిగా మారింది. ఫొటోలు తీయటం అనేది నేరం కాదు.. అయినా ఆసక్తికర చర్చ నడుస్తుంది. పిచ్ ఫొటోలను AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రివ్యూ చేయబోతున్నాడని.. పిచ్ ఫొటోలు అప్ లోడ్ చేసి డేటా కలెక్ట్ చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. 

పిచ్ అంటే చూసి వెళతారు.. అలాంటి కమిన్స్ ఫొటోలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి.. ఎందుకు ఫొటోలు తీశాడు అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ అభిమానులను వెంటాడుతోంది. పిచ్ ఫొటోలతో ఆస్ట్రేలియా జట్టు ఏదో చేయబోతుంది.. చాట్ జీపీటీ ఉపయోగించి డేటా తీయబోతుంది.. మాస్టర్ ప్లాన్ లేకుండా ఊరికే ఫొటోలు అయితే తీయడు కదా అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19వ తేదీ ఆదివారం మధ్యహ్నం ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఒక రోజు ముందే పిచ్ అంతా రెడీ అయ్యింది.. రిపోర్టులు కూడా వస్తున్నాయి.. అయినా పిచ్ దగ్గరగా వచ్చి మరీ ఫొటోలు తీసుకోవటం వెనక కారణాలు ఏంటీ అనేది ఇంట్రిస్టింగ్ పాయింట్.. రేపు మ్యాచ్ రిజల్ట్ తర్వాత కానీ అసలు విషయం తెలియదు.. ఫొటోలు ఎందుకు తీశాడు అనేది.. అప్పటి వరకు సస్పెన్స్...