పఠాన్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పఠాన్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నాలుగేళ్ల గ్యాప్ తర్వాత  ‘పఠాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌తో  ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. జాన్ అబ్రహం విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. జనవరి 25న సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ పాటలు, టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేశారు.

ఒక ప్రైవేట్ టెర్రర్ గ్రూప్ ఇండియాపై  భయంకరమైన ఎటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్లాన్ చేస్తుంది. దాన్ని లీడ్ చేసే వాడిగా జాన్ అబ్రహం కనిపిస్తాడు. దేశాన్ని కాపాడే సోల్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా షారుఖ్ యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు హాలీవుడ్ రేంజ్ స్టన్నింగ్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ‘ఒక సోల్జర్ ఎప్పుడూ దేశం తనకోసం ఏం చేసిందని అడగడు. దేశం కోసం తను ఏం చేయగలనా అని ఆలోచిస్తాడు’ అని ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షారుఖ్ చెప్పిన డైలాగ్ బాగుంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షారుఖ్, దీపిక​ స్టైలిష్ లుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెస్మరైజ్ చేస్తున్నారు.