వైద్యుల నిర్లక్ష్యం.. పేషెంట్ మృతి

వైద్యుల నిర్లక్ష్యం..  పేషెంట్ మృతి

చైతన్యపురిలోని షణ్ముఖ హాస్పిటల్ ముందు ఓ వ్యక్తి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నేపాల్ రాష్ట్రానికి చెందిన కమల్ బహుదూర్ బతుకు దెరువు కోసం వచ్చి హైదరాబాద్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రాజధాని బస్సులో కరెంట్ షాక్ తగిలి తీవ్రగాయాలపాలయ్యాడు. ముందు ఉస్మానియా ఆస్పత్రి, అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యమందించిన కుటుంబ సభ్యులు.. మే 21న మేనెజ్మెంట్ హామీతో కమల్ ను షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.ఆస్పత్రి ఖర్చుల కోసం నేపాల్ లో చందాలు వసూలు చేసి 8లక్షలు చెల్లించారు. ఈ క్రమంలోనే కమల్ బహుదూర్ మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో కమల్ చనిపోయాడంటూ నిరసన చేపట్టారు బంధువులు.