గాంధీ ఆస్పత్రి లో గంటల పాటు మెట్ల పైనే .. ట్రీట్ మెంట్​కు వచ్చిన మహిళా పేషెంట్లకు ఇబ్బందులు

 గాంధీ ఆస్పత్రి లో గంటల పాటు మెట్ల పైనే .. ట్రీట్ మెంట్​కు వచ్చిన మహిళా పేషెంట్లకు ఇబ్బందులు
  • ఎంసీహెచ్​​లో మెయిటింగ్ ​హాల్, కుర్చీలు లేవు 

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ ఆస్పత్రి ఆవరణలోని మదర్​ అండ్ ​చైల్డ్​ ఆస్పత్రి( ఎంసీ హెచ్​ ) ఓపీ వద్ద వెయిటింగ్​హాల్,​ కుర్చీలు లేక మహిళా పేషెంట్లు గంటల తరబడి నిలబడే పరిస్థితి  ఉంది.  ఓపీ చిట్టీ తీసుకున్నాక గర్భి ణులు, ఇతర గైనిక్​సమస్యలున్న పేషెంట్లు తమ నంబర్ వచ్చే వరకు ఆస్పత్రి మెట్ల పైనే కూర్చుంటున్నారు. మరికొందరు నిలబడి ఉండాల్సి వస్తుంది.

ఇటీవలే ఆస్పత్రి ప్రారంభమవగా ఆవరణలో  ఖాళీ స్థలం ఉన్నందున వెయిటింగ్​ హాల్ నిర్మిస్తే వచ్చిన మహిళా పేషెంట్లకు ఇబ్బందులు తొలగుతాయని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం ఎంసీహెచ్​ఆస్పత్రిలో కేవలం ఓపీ విభాగం మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే ఇన్​పేషెంట్ల విభాగాన్ని కూడా ప్రారంభించబోతున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -ప్రొ.ఎం.రాజారావు తెలిపారు. వెయిటింగ్​హాల్​ నిర్మాణం, కుర్చీలను ఏర్పాటు చేస్తామన్నారు.